మన్యం న్యూస్.దమ్మపేట.మార్చి 16. మండల పరిధిలో ని మందలపల్లి ప్రకాష్ నగర్ కలనిలో 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. ద్వారా మంజూరు అయిన 25 లక్షల రూపాల వ్యయం గల సీసీ రోడ్డు పనులను అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆయన మాట్లాడుతూమారుమూల గ్రామాల్లో సైతం అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని,ఇచ్చిన హామీ ప్రకారం మందలపల్లి పంచాయతీకి అనేక నిధులు కేటాయించడం జరిగిందనీ, ఇటీవల కాలంలో సుమారు 1కోటి 40లక్షలతో మన మందలపల్లిలో సీసీ రోడ్లు పోయడం జరిగిందనీ, ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో నే అనేక అభివృద్ది పనులు జరుగుతున్నాయని,పని చేసే వారిని ప్రజలు ఎప్పుడు మరవకూడదని ఈ సందర్భగా తెలిపారు.గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీమండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,రైతు బంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు,ఎంపీటీసీ అజెయ్,శ్రీను, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, మడివి దుర్గ,రూప సింగ్, కోయ్యల అచ్యుత్ రావు,కో ఆప్షన్ సభ్యులు బుడే, ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ,దారా యుగంధర్,మన్నెం అప్పారావు,ఆకుల కృష్ణారావు,నలగుళ్ళ సత్యనారాయణ, చిన్నంశెట్టి సత్యనారాయణ, రావూరి వీరయ్య,సొడెం గంగరాజు, పానుగంటి చిట్టి బాబు,గ్రామస్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
