చలి బాగా పెరిగిపోతుంది.
తుఫాన్ ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు చలితో అల్లాడిపోయారు. ప్రస్తుతం కాస్త చలి తగ్గినా.. ఫ్యూచర్లో మళ్లీ చలి పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ నిపుణులు. అయితే ఈ చలిలో మిమ్మల్ని హాయిగా, వెచ్చగా ఉంచే కొన్ని డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శీతాకాలంలో చలి నుంచి రక్షించే.. రుచికరమైన కాక్‌టెయిల్‌లు, ఇతర ఆల్కహాలిక్ పానీయాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అందరూ ఆల్క్‌హాల్ ఇష్టపడరు. అయితే మీకోసం నాన్ ఆల్కహాలిక్ పానీయాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వాటిని ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవ్చచు అంటున్నారు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. ఆ డ్రింక్స్ ఏమిటో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హాట్ చాక్లెట్
హాట్ చాక్లెట్ అనేది ఒక క్లాసిక్ శీతాకాలపు పానీయం. ఇది అన్ని వయసుల వారికి ఎల్లప్పుడూ ఫిట్ అవుతుంది. దీన్ని చేయడానికి ఒక సాస్‌పాన్‌లో కొంచెం పాలను తీసుకుని ఆవిరి అయ్యే వరకు వేడి చేసి.. ఆపై రుచికి కొద్దిగా కోకో పౌడర్, చక్కెరను కలపండి. మీరు అదనపు రుచి కోసం వెనిల్లా ఎసెన్స్ లేదా చిటికెడు దాల్చిన చెక్కను కూడా కలుపుకోవచ్చు. హాట్ చాక్లెట్ సిద్ధమైన తర్వాత.. దానిని కప్పులో పోసి హ్యాపీగా సిప్ చేయండి.
హాట బటర్ రమ్
మీరు మీ వింటర్‌ని కాస్త ఎక్కువ ఆనందంగా గడపాలని చూస్తున్నట్లయితే.. హాట్ బటర్ రమ్‌ని ట్రై చేయవచ్చు. ఈ రుచికరమైన డ్రింక్ తయారు చేయడానికి.. వెన్న, బ్రౌన్ షుగర్, దాల్చినచెక్క, జాజికాయ వంటి మసాలా దినుసులను ఒక సాస్ పాన్‌లో కలపండి. వెన్నలో చక్కెర కరిగిపోయే వరకు వేడి చేయండి. తర్వాత దానిలో కొంచెం వేడినీరు, కొంచెం రమ్ సారం (లేదా ఆల్కహాల్ లేని వెర్షన్‌కు ఎనిల్లా సారంతో ప్రత్యామ్నాయం) వేసి.. ప్రతిదీ బాగా కలిసే వరకు కలపాలి. మగ్‌లో వేడి వేడి రమ్‌ని వేసుకుని ఎంజాయ్ చేయండి.
స్పైసీ హాట్ యాపిల్ సైడర్
మరొక రుచికరమైన నాన్-ఆల్కహాలిక్ శీతాకాలపు పానీయం స్పైసీ హాట్ యాపిల్ సైడర్ డ్రింక్. దీన్ని తయారు చేయడానికి.. యాపిల్ సైడర్, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, నారింజను ఒక సాస్ పాన్‌లో తీసుకుని బాగా కలపండి. సుగంధ ద్రవ్యాలు సువాసన వచ్చే వరకు వేడి చేయండి. మీకు కొంచెం అదనపు మసాలా కావాలంటే.. కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అనంతరం దీనిని వడకట్టి.. కప్పులో సర్వ్ చేసుకోండి.
కప్పు చాయ్
మీరు టీకి అభిమాని అయితే.. మీకు వెచ్చని, ఓదార్పునిచ్చే కప్పు చాయ్‌ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం బ్లాక్ టీ, పాలు, చక్కెర, దాల్చినచెక్క, యాలకులు, అల్లం వంటి మసాలా దినుసులు వేసి మరిగించండి. సుగంధ ద్రవ్యాలు సువాసన వచ్చే వరకు వేడి చేయండి. మీరు అదనపు రుచి కోసం వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. చాయ్ సిద్ధమైన తర్వాత.. టీ ఆకులను వడకట్టి మగ్‌లో సర్వ్ చేసుకోండి.