మన్యం న్యూస్ ,అన్నపురెడ్డిపల్లి జనవరి 11 : జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని కలెక్టరేట్ ప్రారంభానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా అన్నపురెడ్డిపల్లిలో కాంగ్రెస్ నాయకుల పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా గాందీ,కిషాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల పుల్లయ్య,ఎల్పిహెచ్ జిల్లా ఉపాధ్యక్షుడు బూక్య చెన్నారావు,మండల కాంగ్రెస్ నాయకులు ఇనపనూరి జమలయ్య,దారావత్ మల్లేష్. లాకావత్ కృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోళ్ల ముత్తయ్య తదితరులు ఉన్నారు.