UPDATES  

 సంక్రాంతి పందేలకు సై అంటున్న పందెం కోళ్ళు . తగ్గేదెలే అంటున్న కోడి పందెం రాయుళ్లు

సంక్రాంతి పందేలకు సై అంటున్న పందెం కోళ్ళు .
తగ్గేదెలే అంటున్న కోడి పందెం రాయుళ్లు
*ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో అడ్డా..

*గుట్టు చప్పుడు కాకుండా కోళ్ల పందాలు.
*పందెం కోళ్ళు మాటున లక్షలకు లక్షలు జూదం..
*పోలీసులకు సవాళ్లుగా మారిన వైనం.
మన్యం న్యూస్ వాజేడు.
తెలంగాణ, ఛత్తీస్గడ్ రాష్ట్రం సరిహద్దుల్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్ల పందాలు అధిక సంఖ్యలో ప్రతి సంక్రాంతి పండగ కి జరుగుతుందనీ పందెం రాయుళ్లు లక్షల రూపాయలు వెచ్చించి రంగు రూపు ఉన్న కోళ్లను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వాజేడు, వెంకటాపురం, మండలం లో పలు గ్రామాల నుండి చతిస్గడ్ రాష్ట్రంలో తాళ్ల గూడెం గ్రామంలో జరిగే కోళ్ల పందేనికి నా డేగాకి, లక్ష, రూపాయలు, నా కాకి కోడికి, లక్ష యాభై వేలు, కోళ్ల రంగును బట్టి కుక్కుట శాస్త్రాన్ని అధ్యయనం చేసి పక్కా ప్రణాళిక తో నిర్ణీత సమయంలో ముహూర్తాలతో సహా కోళ్ల పందాలు జరుగుతాయని తెలిపేవారు లేకపోలేరు, సంక్రాంతి, పండగ అంటేనే కోడిపుంజుల పందెం అన్నట్లుగా పండగ వాతావరణం ఉంటుంది. పందెం రాయుళ్లు లక్షలకు, లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని సంకేతాలు లేకపోలేదు, ఈ నేపథ్యంలో ఒక్కరోజులో లక్ష అధికారులు అయ్యేవారు ఉన్నారు.లక్షలు పోయి కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చేవారు ఉన్నారు. ఏది ఏమైనా సంక్రాంతి పండగ అంటేనే ఓ సంబరం. ఆ సంబరంలో కోడి పందాలు మరింత స్పెషల్, మరోపక్క పోలీసుల కేసులు అయినా సరే మాకు సంబంధం లేదంటూ పందెంరాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. అటు పంజులు కూడా బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఏడాది నుంచి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ నువ్వా నేనా అంటూ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కోర్టుల ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలు ఎన్ని ఉన్నా పందాల రాయుళ్లు మాత్రం వాటిని లెక్కచేయడం లేదు. ఒకపక్క పందాలకు బరులను సిద్ధం చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉంటే మరోపక్క కోళ్ల పందాలకు లక్షలు, కోట్ల రూపాయలు సిద్ధం చేసుకున్నారు.

మూడు ముక్కలాట పండుగకు పక్క.

సంక్రాంతి పండగ అంటేనే కోడి పందాలకు ప్రత్యేకత ఉంది, ఆనాదికాలం నుండి సాంప్రదాయ బద్దంగా వ్యవహరించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సంక్రాంతి పండగ లోగిళ్ళలో మరో జూదం మూడు ముక్కలాట నీడ పట్టున చేరి శారీరక శ్రమ లేకుండా పేక ముక్కలతో లోనకి వెయ్యి రూపాయలు, బయటకి లక్ష రూపాయలు,అంటూ పేకాట పాపారాయుల్లు కోట్ల రూపాయలతో జూదం ఆడుతున్న వారు సంఖ్య ఎక్కువే, ఒక పట్టాన పేకాట, ఒక పట్టాన,కోళ్ల పందాలు జోరందుకుంటే ఇవే ఇప్పుడు పోలీసులకు సవాళ్లుగా మారిన పరిస్థితి కనబడుతుంది, సంక్రాంతి పండగ సందర్భంగా కోర్టులు కోడిపందాలు కానీ పేకాట మరే ఇతర జూతాలకు తావు లేదంటూ జడ్జి సమక్షంలో తీర్పులు వచ్చిన అవేవీ తమకు పట్టవంటూ సంక్రాంతి పండగ అంటేనే కోడి పందాలు, అన్నట్లుగా పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !