UPDATES  

 గ్రామాల్లో సంక్రాంతి శోభ పల్లెల్లో సందడి చేస్తున్న గంగిరెద్దులు

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 13: సంక్రాంతి పండుగకు సందడి చేసే గంగిరెద్దులు వచ్చేశాయి. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి సలాం కొట్టు, అంటూ ఆట ముచ్చటగొల్పింది. గంగిరెద్దుల కులస్తుల సన్నాయిల చప్పుడుకు బసవన్నలు చేసే ఆకట్టుకుంటున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలిచ్చే కానుకలను స్వీకరిస్తూ గంగిరెద్దుల కులస్తులు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. శుక్రవారం మండల పరిదిలోని జమ్మిగూడెం గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బసవన్నల సందడి కనిపించింది. గంగిరెద్దులు చేసే విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. కాగా గ్రామాల్లో గంగిరెద్దుల సందడి కోలాహలంతో సంక్రాంతి సంబరాలు అంబరంటుతున్నాయి. గంగిరెద్దుల కులస్తులు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వీరు డోలు వాయిస్తూ గుమ్మాల దగ్గర గంగిరెద్దులతో ప్రదర్శన చేయిస్తూ యాచిస్తుంటారు. ప్రజలు వారి స్థాయికి తగ్గుట్టు డబ్బులు, బియ్యం, వడ్లు ఇతర వస్తువులను దానం చేస్తుంటారు. వీటిని స్వీకరించిన వారు. ప్రజలను ఆశీర్వదిస్తారు. ఇలా సంక్రాంతి సందడి ముగిసే వరకు ఆయా గ్రామాల్లో తిరుగుతూ.. వచ్చిన డబ్బులు, సామగ్రితో స్వగ్రామానికి తిరుగు పయనమవుతారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !