UPDATES  

NEWS

టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి..200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం.. మాతృ అభయ పౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, పరీక్ష సామాగ్రి, ఆట వస్తువులు పంపిణీ… కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం…అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి.. ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర ప్రారంభం.. ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవి జాతర.. మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు.. ఫోన్ పోయింది…. పోలీస్లు పట్టారు..బాధితునికి అందజేసిన సీఐ రాజువర్మ.. మానవత్వం చాటిన మాలమహానాడు…నిరుపేద రోగికి వితరణ చాటడం అభినందనీయం… – డిప్యూటీ తహసీల్దార్, బీరవెల్లి భరణి బాబు. రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు… వేలం పాట ముగిసింది…

 కోళ్ళకూ పంచాంగ శాస్త్రం

సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి కోడిపందాలు.. తెలంగాణ ప్రాంతంలో తక్కువ అయినప్పటికీ… ఆంధ్ర ప్రాంతంలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.. కోట్లల్లో పందాలు కాస్తూ ఉంటారు.. ఇక ఈ సంక్రాంతి నాలుగు రోజులయితే అక్కడ సందడి తారస్థాయిలో ఉంటుంది.. మనం సినిమాలో చూపించినట్టు కోడిపందాలు ఉండవు.. కోడిపందాలు అంటే రెండు కోళ్లు పోట్లాడుకోవడమే… కానీ ఆ పోట్లాట వెనుక పెద్ద తతంగం ఉంటుంది.. ఆ తతంగం వెనుక ఏకంగా ఒక శాస్త్ర గ్రంథమే ఉంది. కుక్కుట శాస్త్రం కుక్కుట శాస్త్రం..ఇందులో కుక్కుట అంటే సంస్కృతంలో కోడి అని అర్థం. కోడి గురించి వివరించేశాస్త్రం కాబట్టి దానికి కుక్కుట శాస్త్రం అని పేరు పెట్టారు. దీన్ని ఎవరు రాశారో తెలియదు కానీ కోడిపందాల్లో పందాలు కాసే వారికి ఇది ఒక ఆయుధం లాంటిది. యుద్ధానికి భగవద్గీత లాగా… కోడిపందాలకు ఈ కుక్కుట శాస్త్రం అని చెప్పుకోవచ్చు. కుక్కుట శాస్త్రంలో కోడిపందాలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం ఉంది.. కోడిపుంజులు, వాటి పెంపకం, రంగులు, వర్గీకరణ, ఏ సమయంలో పందెం కాయాలి, కోడి జాతకం, కోడిపుంజు జన్మనక్షత్రం లాంటి ఎన్నో విషయాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి.. 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల లో ప్రభావం చూపుతాయి.

అశ్వని నక్షత్రంలో పుట్టిన నెమలి డేగ కోడి కాకి కోడి మీద గెలుస్తుంది. గౌడు పింగళి మీదా విజయం సాధిస్తుంది.. భరణి నక్షత్రంలో పుట్టిన సవనల నెమలి ఇటుక ఎరుపు కోడి మీద, పిచ్చుక రంగు గౌడ నెమలి మీద, ఎర్ర పొడ ఎర్రటి కాకి మీద గెలుస్తుంది.. కృత్తిక నక్షత్రంలో పుట్టిన ఎర్ర కాక మీద పిచ్చుక రంగు గౌడు నెమలి, ఎర్ర పొడ కోడి గెలుస్తుంది.. రోహిణి నక్షత్రంలో పుట్టిన నెమలి నల్ల మైల కోడి పింగళి ఎర్రకోడి, కాకి ఎర్ర గౌడు కోడి మీద గెలుస్తుంది.. మృగశిరలో పుట్టిన కాకి డేగ.. డేగ పసుపు కాకి, పింగళి కాకి, ఇటుక రంగు డేగ ముంగిస మీద విజయం సాధిస్తుంది.. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన డేగ కాకి మీద… కాకి పింగళి, నల్లమైనా, డేగ పసమి, కాకి కోడి, వెన్నె పోడ పొడి, నల్లపొడ కోడి, ఎర్ర పొడ కోడి, పిచ్చుక రంగు గౌడు కోళ్ళు గెలుస్తాయి. పునర్వాస నక్షత్రంలో పుట్టిన కాకి కోడి మీద, సుద్ధ కాకి కోడి మీద నెమలి డేగ, పిచ్చుక రంగు గౌడు నల్ల బోర, ఎర్రకోడి పుష్యకాకి కోడి మీద, పసమీ కాకి, నల్ల కాకి మీద, పింగళి డేగ, నెమలి మీద, కోడి నెమలి మీద, కాకి పింగళి మీద గెలుస్తుంది.. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నెమలి డేగ.. పింగళి తుమ్మెద రంగు కాకి , పసుపు రంగు కాగిడేగ, కాకి పిచ్చుక రంగు కోడి, ఎర్రకోడి నల్ల బోర మీద గెలుస్తుంది. మాఘంలో పుట్టిన డేగ నెమలి, కోడి పింగళి… పసుపు రంగు కాగిడేగ మీద , ఎరుపు నెమలి నలుపు డేగ మీద, కోడి గోధుమ రంగు బేగం మీద గెలుస్తాయి.. పూర్వ ఫాల్గుణి, పుబ్బ నక్షత్రంలో పుట్టిన కాకి నెమలి, డేగ మీద… నెమలి పింగళి గెలుస్తుంది.. ఉత్తర ఫాల్గుణి లో పుట్టిన కోడి నెమలి, కాకి కోడి, డేగ, పింగళి… గోధుమ రంగు డేగ, నలుపు రంగు డేగ మీద గెలుస్తాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !