UPDATES  

 ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి _వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు.

మన్యం న్యూస్ మంగపేట.
మకర సంక్రాంతి రైతుల జీవితాల్లో సరికొత్త కాంతిని తీసుకురావాలని ఈ దిశగా ప్రభుత్వాలు గట్టి మేలు తలపెట్టాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. మండలంలోని అకినేపెళ్లి మల్లారం గ్రామంలో వికాస్ అగ్రి పౌండేషన్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగకి వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నందున రైతుల పండుగ సంక్రాంతి అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురవడం మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన గిట్టుబాటు ధర లభించడంతో అన్నదాతలు సంతోషంతో ఉన్నారని అందుకే పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకుందని సాంబశివరెడ్డి అన్నారు వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయాలని ముఖ్యంగా గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సాంబశివరెడ్డి డిమాండ్ చేశారు. రైతు రాజ్య స్థాపనకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నేటి కంప్యూటర్ యుగంలో నాటి పల్లె పండుగల సంస్కృతులు సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని సాంబశివరెడ్డి అన్నారు. పల్లెల్లో జన్మించి పట్టణాల్లో ఉన్నత స్థితిలో స్థిరపడ్డ ప్రముఖులు ప్రవాస భారతీయులు తమ జన్మభూమి పల్లె ప్రగతి కోసం పాటుపడాలని సాంబశివరెడ్డి పిలుపునిచ్చారు. వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు అనంతరం సాంబశివరెడ్డి దంపతులు గంగిరెద్దుకు గోపూజ నిర్వహించి బియ్యం నూతన వస్త్రాలను బహుకరించారు. అనంతరం గంగిరెద్దు విన్యాసాలు చిన్నారుల పతంగుల ఆటలు మహిళల రంగవల్లులను తిలకించారు రైతులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ సిబ్బంది చెట్టుపల్లి తిరుపతిరావు జడ్డి పూర్ణ ప్రసాద్ శేషారెడ్డి నరేందర్ రెడ్డి నవ్య ప్రసన్న గోపయ్య స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !