UPDATES  

 ఈ నెల18ఖమ్మం పోలీస్ ఆంక్షలు ఇవే…అత్యవసర ప్రయాణాలు అయితే తప్ప సాధారణ ప్రయాణాలు వాయిదా వేసుకోండి : ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్

ఈ నెల18ఖమ్మం పోలీస్ ఆంక్షలు ఇవే
*అత్యవసర ప్రయాణాలు అయితే తప్ప సాధారణ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
* ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి: ఈనెల 18న ఖమ్మంలో బి.ఆర్.ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారీగా జనాలు తరలి రానున్న నేపథ్యంలో పలు రోడ్డు మార్గాలకు అక్షర విధించారు. వాహనదారులు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆ శాఖ కోరింది.
ఖమ్మం నగరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖమ్మం పర్యటనలో భాగముగా ఖమ్మం నందు నిర్మించిన కొత్త కలెక్టరేట్ కార్యాలయ సముదాయాల ప్రారంబోత్సవం అనంతరం జరిగే భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభ ఈ నెల18 న ఉదయం 06:00 గంటల నుండి 23:00 గంటల వరకు ఖమ్మం వైపునకు వచ్చు సాదారణ భారీ వాహనాల ట్రాఫిక్ ను క్రమబద్దీకరించుట లో భాగముగా ఈ క్రింద తెలిపిన రూట్లలో దారి మళ్లించటం జరుగుతుంది.
దారి మళ్లించిన వాహనాలు వెళ్ళు మార్గాలు
సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం కొత్త బైపాస్ రోడ్డు వైపునకు (కొత్త హైవే) వచ్చు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం పాత రోడ్డు వైపునకు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం పాత బైపాస్ రోడ్డు వైపునకు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#కోదాడ నుండి ఖమ్మం వైపు కు వచ్చు వాహనాలు విజయవాడ హై వే వైపు కు దారి మల్లించటం జరిగినది
#కూసుమంచి కి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు మూటాపురం, నేలకొండపల్లి కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#ఖమ్మం రూరల్ PS లిమిట్స్ లోని వేంకటగిరి క్రాస్ రోడ్డు వైపు కు వచ్చు వాహనాలు, వేంకటగిరి/ ముదిగొండ – వల్లభి వైపు – చిల్లకల్లు హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#ఖమ్మం రూరల్ లిమిట్స్ లోని కోదాడ క్రాస్ రోడ్డు కి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#ఖమ్మం రూరల్ లిమిట్స్ లోని నాయుడుపేట జంక్షన్ కి వరంగల్ వైపు నుండి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్, కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
# పెనుబల్లి టౌన్ కి సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి వచ్చిన వాహనాలు తిరువూరు- మైలవరం- విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#తల్లాడ కు సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి వరంగల్ వైపు వెళ్ళు వాహనాలు ఏన్కూర్, తిమ్మారావు పేట, ముచెర్ల క్రాస్ రోడ్డు మీదుగా డోర్నకల్ వైపు దారి మల్లించటం జరిగినది.
#ఏన్కూర్ కు కొత్తగుడెం, తల్లాడ వైపు నుండి వచ్చు వాహనాలు ఏన్కూరు, తిమ్మారావు పేట, ముచ్చేర్ల క్రాస్ రోడ్డు మీదుగా డోర్నకల్-మహబూబాబాద్ వైపు దారి మల్లించటం జరిగినది.
#వైరా టౌన్ కు తల్లాడ, సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్ళు వాహనాలు పాలడుగు–బోనకల్, చిల్లకల్లు హైవే వైపుకు దారి మల్లించటం జరిగినది.
#పల్లిపాడుకు ఏన్కూర్, జన్నారం వైపు నుండి వచ్చు వాహనాలు వైరా-పాలడుగు-బోనకల్, చిల్లకల్లు హైవే వైపుకు దారి మల్లించటం జరిగినది.
#ములకలపల్లి క్రాస్ రోడ్డు కు కురవి, మహబూబాబాద్ నుండి హైదరాబద్, విజయవాడ వెళ్ళు వాహానాలు ఎదులపురం సర్కిల్ మీదుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్-కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#వరంగల్ రోడ్డు లోని ఏదులాపురం క్రాస్ రోడ్డు కు వరంగల్ వైపు నుండి సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం కు వెళ్ళు వాహానాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్, కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
#బోనకల్ గ్రామ సెంటర్ నుండి వచ్చు వాహనాలు తిరిగి చిల్లకల్లు వైపు కు దారి మల్లించటం జరిగినది.
#ఇల్లందు రోడ్డు లోని ముచ్చర్ల క్రాస్ రోడ్డు వైపు కు వచ్చిన వాహనాలు డోర్నకల్, మహబూబాబాద్ మీదుగా దారి మల్లించటం జరిగినది.
#మరిపెడ బంగ్లా కు వరంగల్ వైపు నుండి సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం కు వెళ్ళు వాహానాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ -కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
కావున ప్రజలందరు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండుట వలన అత్యవసర ప్రయాణాలు తప్ప, అనవసర ప్రయణాలను చేయకండి, ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడవలసి వస్తుందని, ఈ నెల18 ఉదయం 06:00 గంటల నుండి 23:00 గంటల దారి మళ్లించిన మార్గాలను గుర్తించి ఆ మార్గాలలో మీ ప్రయాణాలను కొనసాగించి ఖమ్మం పోలీస్ వారికి సహకరించగలరు అని వారు విజ్నప్తి చేశారు..

ఖమ్మం కమీషనర్ అఫ్ పోలీస్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !