మన్యం న్యూస్ ఇల్లందు జనవరి24: పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఇల్లందులో జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ అధ్వర్యంలో మంగళవారంమున్నూరు కాపు సంఘం తరపున ఎంపీ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్సాహంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుక ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో టిబిజీకెఎస్ ప్రెసిడెంట్ రంగనాథ్, కాపు సంఘం సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.