UPDATES  

 ఘనంగా రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర జన్మదిన వేడుకలు

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 24: అశ్వారావుపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్య ప్రకాష్ రావు, నాయకులు తాడేపల్లి రవి, వాస ఏసుబాబు, బండారు శ్రీనివాసరావు, చిన్నంశెట్టి సత్యనారాయణ, గుండెపనేని ఉపేందర్ రావ్, మాసాభత్తుల రాము, కట్ట శ్రీనివాసరావు, కట్టా సుబ్బారావు, కురిశెట్టి నాగబాబు నాయుడు, సత్యం రామకృష్ణ, మద్దాల నాగేశ్వరరావు, చిన్నంశెట్టి రాంబాబు, కొల్లు రమేష్ నాయుడు, పెన్నాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !