మన్యం న్యూస్ సారపాక, ఫిబ్రవరి 03
స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సారపాక పట్టణంలోని ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. శుక్రవారం సారపాక పట్టణంలోని పవన్ ఐటిఐ విద్యాసంస్థల అధినేత మందడపు పూర్ణచంద్రరావు, ప్రమీల దంపతుల కుమార్తె మీనాక్షి ఓణీల అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు మండలం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ లు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సోంపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాదె నరసింహారెడ్డి, పండగ రాములు, కనుక సీతయ్య తదితరులు పాల్గొన్నారు.