UPDATES  

 రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ పై అనుచితంగా అహంకారంగా హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలి. మంగపేట మండల దళిత సంఘాలు

మన్యం న్యూస్, మంగపేట. ఫిబ్రవరి 11…
సోషల్ మీడియా వేదికగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బ్రతికి ఉంటే గాంధీ ని గాడ్సే చంపినట్లు చంపుతానంటూ అనుచితంగా
మాట్లాడిన మనువాద మతోన్మాది హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మంగపేట మండల అంబేద్కర్ సంఘం, దళిత ప్రజా కుల సంఘాల నాయకులు శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దుర్మార్గమైన దారుణమైన వ్యాఖ్యలు మరొకరు ఇలా మాట్లాడకుండా కఠినంగా శిక్షించాలని అన్నారు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మనువాద మతోన్మాది హమారా ప్రసాద్ నిరంతరం తాను చేస్తున్న చిల్లర పనులకు తోడుగా వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత పైనే కండ కావరమెక్కి మాట్లాడటం దేశ ప్రతిష్టకే అవమానకరమని, హమారా ప్రసాద్ ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతూ తాను ఏదో ఒక విధంగా ఒకే రోజులో పాపులర్ అయిపోవాలి అనే దుష్ట ఆలోచన తో భారత జాతి కి దైవ సమానుడు, దేశానికి దిశా నిర్దేశం చేసిన డాక్టర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై చట్టప్రకారం కఠిన శిక్ష లు అమలు చేయాలనీ డిమాండ్ దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ భావజాల వాదులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం నాయకులు బసరికాని హరి కృష్ణ పగిడేపల్లి వెంకటేశ్వర్లు అంబేద్కర్ విగ్రహాదాత చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, గoగేర్ల రాజారత్నం రాజమల్ల సుకుమార్ నిమ్మగడ్డ ప్రవీణ్ పరిక శ్రీను గుగిల్ల సురేష్ మైప లాలయ్య ఎడ్డ నరేష్ ఎడ్డ శ్రీను వాస్ బోడ శ్రీను బోడ బొర్రయ్య కాస్ప ముకుందాం బోడ రామచంద్రం
జై భీమ్ రాంమోహన్ ఈసంపెళ్లి సురేoదర్ చిక్కుల శ్రీకాంత్ చిట్యాల రాజశేఖర్ బోడ జయరాజు బోడ శ్రీనివాసు మేడిపల్లి శశి కుమార్ బోడ సతీష్ ఎల్పి కిరణ్ డోల్లి ప్రవీణ్ మే మొరం శ్రీనివాస్ డోలి విజయ శేఖర్ బoటు విశ్వనాథo కూకట్ల శ్రీనివాస్ జనపట్ల జయరాజ్ జంగబాను చందర్ దాసరి ఎల్లయ్య దాసరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !