మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 15, మండల పరిధిలోని పడమట నర్సాపురం డంపింగ్ యార్డులో ఏర్పాటుచేసిన వర్మి కంపోస్ట్ ఫిట్లను బుధవారం జిల్లా పంచాయతీ రాజ్ అధికారి రమాకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనుల వివరాల గురించి పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ సిబ్బందికి పలు రకాల సూచనలు సలహాలు ఇచ్చారు. వర్మి కంపోస్ట్ ఫిట్లు నిర్వాహణ పై సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీల అధికారి రామారావు, గ్రామ కార్యదర్శి తిరుపతిరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
