UPDATES  

 నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ రేగా సతీమణి సుధారాణి

మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 16… మండల కేంద్రంలో జరిగిన నూతన గృహప్రవేశ వేడుకకు గురువారం పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి హాజరై సత్యనారాయణ వ్రతం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని గౌరీశెట్టి సత్యనారాయణ, గౌరీశెట్టి ప్రభాకర్ గురువారం నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమానికి రేగా సుధారాణి హాజరై ఆదిత్యాన్ని స్వీకరించారు. అనంతరం కొద్ది రోజుల క్రితం నూతన గృహప్రవేశం చేసిన కోడూరి శ్యామ్, అంబటి శ్రీనివాస్, తిరుకొల్లూరి వెంకన్న నూతన గృహాలను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, మైనారిటీ సెల్ అధ్యక్షులు సుభాని, పార్టీ నాయకులు సతీష్ , తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !