UPDATES  

 వివాహేతర సంబంధం తో పట్టుబడ్డ ఇద్దరు టీచర్లకు దేహ శుద్ధి

మన్యం న్యూస్ మంగపేట, ఫిబ్రవరి 21
గురుబ్రహ్మ, గురువిష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని పూజించే గురువులే నీచపు పనులకు ఒడిగట్టారు.
విద్యాబుద్ధులు నేర్పే గురువులు దారి తప్పారు.వివాహేతర సంబం ధంతో ఇద్దరు టీచర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారు.వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం లోని జెడ్పీహెచ్ఎస్ లో ఫిజికల్ సైన్స్,బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్,మరో టీచర్ కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. టీచర్ భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.వారి వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ ఈ తతంగంపై గతంలోనే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాడు.దీంతో సదరు టీచర్ ను జనవరిలో మంగపేట నుంచి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపారు.అయినా వారు తీరు మార్చుకోలేదు.ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగించారు.ఈ క్రమంలో టీచర్ భర్త ఫిబ్రవరి 18న శివరాత్రి వేములవాడకు బందో బస్తు కోసం వెళ్లి వచ్చా డు,ఆయనకు సోమవారం హాలీ డే రావడంతో భార్య, కూతురిని చూసేందుకు మంగపేటకు వచ్చాడు. ఈ క్రమంలో నాగేందర్ టీచర్ సెల్ కు ఫోన్ చేయగా కానిస్టేబుల్ లిఫ్ట్ చేశాడు హాలో అనకముందే తాను వస్తున్నానని తలుపు తీసి ఉంచాలని చెప్పాడు.దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పకుండా చివరి గదిని లాక్ చేసి ముందు తలుపులు తీసి ఉంచి బాత్రూమ్ లో దాక్కు న్నాడు.ఉపాధ్యాయుడు రాత్రి ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళగానే బయటి నుంచి తాళం వేశాడు. కొత్త గూడ మండలంలోని బంధువులకు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చాడు. నాగేందర్ టీచర్ కు దేహశుద్ధి చేసి మండల కేంద్రంలో ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !