మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 21.. మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వినయ్ కళ్యాణ్ అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి మాండ్యం సమీపంలోనీ కెనాల్ లో గల్లంతయ్యాడు, విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పరామర్శించారు వారితోపాటు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, కామిరెడ్డి రామ కొండారెడ్డి, బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీష్, సాలయ్య కొనకంచి శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, దివాకర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితిపార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.