- గ్రామపంచాయతీలకు గ్రహణం.
- ఎనిమిధి నెలలైనా వెక్కిరింపే
- పంచాయితీలలో పాలన అష్టకష్టం
- బిల్లులు రాక కుంటుపడుతున్న అభివృద్ధి
- సమస్యలతో సతమతమవుతున్న సర్పంచ్ లు
మన్యం న్యూస్ వాజేడు. ఫిబ్రవరి 21
వాజేడు మండలంలో గ్రామపంచాయతీలకు గ్రహణం పట్టినట్లుగా గత ఎనిమిది నెలలుగా గ్రామపంచాయతీలకు నిధుల కొరతతో రోజువారి పనులు సైతం గడవక కష్టకాలంలో కాలాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి నిండుగా కనబడుతుంది.గ్రామ పంచాయితీ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని, 500 ఓటర్లు ఉన్న గ్రామాల జనాభా ప్రాతిపదికన చిన్నచిన్న గ్రామ పంచాయితీలుగా చేసి పరిపాలన సౌలభ్యం కొరకు ప్రతి ఒక వ్యక్తికి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలాగా ప్రభుత్వం పంచాయతీలను చేస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామపంచాయతీల ఆర్థిక వ్యవస్థ క్షీణించి
పంచాయతీల అభివృద్ధి కుంటుపడినట్లుగా, పంచాయితీల పనితీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పన్నుల అమౌంట్ రాక, ఎనిమిది మాసాలుగా అవుతుందంటే అతిశయక్తి కాదు, గ్రామ పంచాయతీల పాలన దిన దిన గండంగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
పంచాయతీలలో చుక్కెదురు
గ్రామ పంచాయితీల అభివృద్ధి దిశా దశలు మార్చే పాలనా యంత్రాంగం లో కీలకంగా వ్యవహరిస్తున్న వారు గ్రామ పంచాయితీ సెక్రటరీ, గ్రామాలలో ప్రజల అవసరాల కోసం అనేక కార్యక్రమాలు ప్రతినిత్యం చేస్తుంటారు.గ్రామ పంచాయితీలలో మల్టిపుల్ వర్కర్లు కు సైతం నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో గ్రామ పంచాయితి ఉందని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు గ్రామాలలో తడి చెత్త, పొడి చెత్త, వంటి కార్యక్రమాల దృష్ట్యా ట్రాక్టర్ పంచాయితీ పరిధిలో చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. అద్భుతమైన కార్యక్రమాన్ని చేయటానికి పంచాయతీలో ఆర్థిక పరిస్థితులు లోపించాయని సెక్రెటరీ తమ నెలసరి జీతాలు సైతం గ్రామ పంచాయితీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు.
గ్రామ పంచయతీలకు ప్రతినెల పరిపాలన సౌలభ్యం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించారు. ప్రతి నెలకు సకాలంలో రాకపోగా గ్రామ పంచాయతీల పాలన వ్యవస్థ క్షినించిపోతుందనీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన అమౌంట్ గ్రామపంచాయతీ అకౌంట్లో వేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ వాళ్ళు అభివృద్ధి పనులకు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నామని ఆరోపిస్తున్నారు