మన్యం న్యూస్.దమ్మపేట. ఫిబ్రవరీ21 …అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను తాటిసుబ్బన గూడెం ఆయన నివాసం లొ ములకలపల్లి మండలం రాచన్నగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ కొర్సా.గణపతి,ఎంపీటీసీ మడకం.విజయ పోడు సాగు భూమి సమస్యల పై మంగళవారం వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచన్నగూడెం పంచాయితీ లో గత 30 సంవత్సరాల నుండి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను సర్వే చేసి రెండు సంవత్సరాలు లు పూర్తి కావస్తున్న ఎటువంటి హక్కు పత్రాలు ఇవ్వలేదని, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టి కి తెలియజేయగ వెంటనే జిల్లా కలెక్టర్ కు సమస్యను చరవాణి ద్వారా ఈ సమస్య పరిష్కారించవలసిందిగా కోరారు.త్వరలో నే గిరిజనుల కు పట్టాలు మంజూరు అవుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.కార్యక్రమం లో ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్,స్థానిక ప్రజాపంధా నాయకులు పోతుగంటి.లక్ష్మణ్,కుంజాసూర్యనారాయణ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.