UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు : ఎస్పీ డా.వినీత్

  • మేమున్నామని మీకేం కాదని…
  • జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు : ఎస్పీ డా.వినీత్
  • పినపాక మండలం పిట్టతోగు గుత్తి కోయ గ్రామంలో సోలార్ వీది లైట్లను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని వారి సంక్షేమం కోసం ప్రత్యేకమైన దృష్టి సారిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. మంగళవారం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పినపాక మండలానికి చెందిన పిట్టతోగు గుత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన 05 సోలార్ విద్యుద్దీపాలను(వీది లైట్లు) మంగళవారం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ప్రారంభించారు.అదే విధంగా గ్రామంలోని 22 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున దోమ తెరలను అందజేసారు.ఇందులో భాగంగానే తిర్లాపురం,నీలాద్రిపేట,నెమలిగూడెం,పడిగాపురం గుత్తికోయ గ్రామాలకు కూడా మొత్తం 22 సోలార్ విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది.తరువాత అక్కడ ఉన్న యువకులకు వాలీ బాల్ కిట్ ను అందజేసి వారితో కలిసి సరదాగా ఆటలో పాల్గోన్నారు.అనంతరం ఎస్పీ గారు జిల్లా గ్రామస్తులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి వలస వచ్చి జీవనం సాగిస్తున్న గుత్తికోయ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వారి సంక్షేమం,అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు.కరెంట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గుత్తికోయ గ్రామాల్లో ముందుగా సోలార్ వీది దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి మారుమూల గ్రామాలలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామని తెలియజేశారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు.మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారి,వారి స్వప్రయోజనాల కోసం అమాయకులైన గుత్తికోయలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు.ఎలాంటి ఆపదలు తలెత్తినా పోలీసు వారి సహాయ సహకారాలు పొందాలని తెలిపారు.తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్న పోలీసువారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.నిరంతరం గుత్తికోయ గ్రామాలను సందర్శిస్తూ,వారికి కనీస సౌకర్యాలను సమకూర్చటానికి కృషి చేస్తున్న మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్,ఎస్సై నాగుల్ మీరా సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,సిఐ రాజగోపాల్,ఎస్సై నాగుల్ మీరా మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !