- రజకులు కు ఇచ్చిన ఉచిత విద్యుత్తు బిల్లులు బకాయిలపై కరెంటు అధికారుల వేధింపులు అరికట్టాలి.
- ఉచిత విద్యుత్ బిల్లులు బకాయిలు కట్టొద్దు
- రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు
మన్యం న్యూస్. ములకలపల్లి. ఫిబ్రవరీ 21.మండల కేంద్రం లొ రజక వృత్తిదారుల సంఘం ముఖ్యుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లొ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ రజకులంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వంతో పోరాడి మన హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని,ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న రజకులను, నాయి బ్రాహ్మణులని కరెంటు బిల్లులు కట్టాలని అధికారులు లబ్ధిదారులువేధిస్తున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఉచిత విద్యుత్ బిల్లులు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర మొత్తం ఈ పరిస్థితి నెలకొంది కావున రజకులు ఈ ఉచిత విద్యుత్ బిల్లులు బకాయిలు కట్టాల్సిన అవసరం లేదని, ఇది ప్రభుత్వ ఉచిత పథకమని అన్నారు.విద్యుత్ అధికారుల వేధింపులు ఆపకపోతే రజకులను,నాయి బ్రాహ్మణులను ఏకం చేసి అందరితో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు.ఉచిత విద్యుత్ పథకం ఇప్పుడు ఎల్ టి 2 గా ఉన్నది ఈ పథకాన్ని ఎల్ టి 4గా మార్చాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దళిత బంధు రూ.10 లక్షల రూపాయలు లాగే రజకులకు కూడా రజక బంధు రూ.10 లక్షలు ఇవ్వాలని,ఇంటి స్థలములేని వారికీ ఇంటి స్థలం కల్పించి రూ. 3 లక్షల గృహ నిర్మాణ పథకాన్ని అమలుపరచాలని,రజకుల స్త్రీల పై అత్యాచారాలు అవమానాలు జరగకుండా ఉంటానికి రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు రాంబాబు, కుప్పిలి ప్రదీప్,నగరికంటి ప్రసాద్, నగరికంటి నగేష్,ప్రశాంత్ భుజంగరావు,కందుకూరు సత్యనారాయణ,కందుకూరు నాగయ్య, కే వెంకటయ్య రాంబాబు, ధర్మరాజుల సాంబ, ముదిగొండ రవికుమార్, కందుకూరి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.