మన్యం న్యూస్, దమ్మపేట, ఫిబ్రవరి, 21.. దమ్మపేట మండలంలో మంగళవారం పలు కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరబద్రం పాల్గొన్నారు. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామం లో శ్రీ సీతారామాంజనేయ అలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమం అలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మెరకు వార్షికోత్సవం లో ఆయన పాల్గొన్నారు అలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. తదుపరి అలయ కమిటీ సభ్యులుతో కలిసి సీతారామాంజనేయ స్వామి వార్ల కు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సోయం వీరభద్రంకి కమిటీ సభ్యులు శాలువ కప్పి ఘనం గా సన్మానo చేసారు. ఆదేవింగంగా మండల పరిదిలోని పార్కలగండి గ్రామం లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మండల కన్వీనర్ నెట్టా రామకృష్ణ కొన్ని రోజులు క్రీతం అనారోగ్యం తో ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేయించుకొని ప్రస్తుతం వారి స్వగృహంలో విశ్రాంతి తిసుకుంటున్నా వారిని పరామర్శించి, ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని, ఆరోగ్యం కుదుట పడేవారికి తగు విశ్రాంతి తీసుకొవలని తెలియజేసారు. పడుగు ముత్యాలరావు, గుర్రం.వెంకటేశ్వర్లు, గుర్రం మల్లయ్య, మాజీ ఎంపీటీసీ గంటా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండలం కన్వీనర్ కొనకళ్ల శ్రీనివాసరావు, సూర్యకుమార్, చేపా జోగారావు తదితరులు పాల్గొన్నారు.