మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 21.. కరకగూడెం మండల పరిదిలోని కరకగూడెం గ్రామానికీ చెందిన బాదె.సంతోష్ ఇటివల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అదేవిధంగా కరకగూడెం గ్రామానికి చెందిన సట్ల. ముత్తయ్య అనారోగ్యంతో మరణించగా వారి స్వగృహాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బాదె.సంతోష్ ,సట్ల.ముత్తయ్య కుటుంబానికి 25 కెజీల బియ్యం అర్ధిక సహాయం చంద సంతోష్ కుమార్ అందజేశారు.అదె గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడగం.రాము ప్రమాదవశాత్తు కిందపడి చేయి విరిగిన విషయం తెలుసుకొని అయన నివాసనికి వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,బట్టుపల్లి సర్పంచ్ తోలెం. నాగేశ్వరరావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి.వెంకటేశ్వర్లు,మహిళా నాయకురాలు చందా.వెంకట రత్నమ్మ,మండల కార్యదర్శి షేక్ రఫీ, బైరిషెట్టీ.రామారావు,ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.