మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 21 : మండలం కేంద్రంలోని పలు సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు.అనంతరం కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత, జడ్పిటిసి భారత్ లావణ్య,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు,సర్పంచ్ బోడా పద్మ,ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు,ఇటుకల హరి,రుంజా నాగు నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.