మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి21
మండలంలోని మర్రికుంట గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుచేతుల మీదుగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వేపలగడ్డ, కొమ్ము నకిరేపేట, గ్రామాలకు చెందిన క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న వాలీబాల్ క్రీడాకారులు ఆటలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వాలీబాల్ ఆటలు మరింతగా రాణించి జిల్లా, రాష్ట్రం, జాతీయ, స్థాయిలో ఉత్తమ ప్రతిభ ఘనపరిచి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అని నేడు యువత విద్యతో క్రీడారంగంలో రాణించాలి దానికి అన్ని సహాయ సహకారాలు తన వంతు అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.