మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి21.. దేశ చరిత్రలో దళిత బంధు ఒక గొప్ప పథకమని రాజ్యాంగ నిర్మాణ కర్త అంబేద్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మండలంలోని సోంపల్లి గ్రామపంచాయతీ దళిత బంధు పథకం కింద మంజూరైన ఆటోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ప్రజా సంక్షేమ పథకాలు అమలు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగ్రామీలో ఉందన్నారు .మండలం లోని మర్రికుంట గ్రామం నందు సోంపల్లి గ్రామానికి చెందిన బింగి తిరుపతిరావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మంజూరైన యూనిట్ ను ఆయన ప్రారంభించారు . , దళితుల అభ్యున్న తే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని గుర్తించారు ఎస్సీల కోసం పది లక్షల రూపాయల విలువగల యూనిట్లను పూర్తిగా ఉచితంగా మంజూరు చేస్తూ వారికి జీవన ఉపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి నిరంతరం తపిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పొడి ముత్యాలమ్మ, ఏపీ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీష్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వలదాసు సాలయ్య, మాజీ ఎంపీటీసీ వల్లూరి వంశీకృష్ణ తెలంగాణ ఉద్యమ నాయకులు పోడియం నరేందర్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.