- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేసిన ఘనత సీఎం కేసీఆర్ దే
- రూ.4.80కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్, బూర్గంపాడు ఫిబ్రవరి 21.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేక రోల్ మోడల్ గా నిలిచిందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని మర్రికుంట గ్రామం నందు వయా వేపలగడ్డ వరకు సుమారు రూ. 2 కోట్ల అంచనాతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, నకిరేపేట నుండి ఉప్పుసాక వరకు వయా గోపాలపురం వరకు సుమారు రూ.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, ఆర్ అండ్ బి రోడ్డు నుండి చెరువు సింగారం వరకు సుమారు రూ.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా ఉన్నదని అన్నారు, దేశవ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమాన్ని విస్తృతం చేసి అమలు చేసేదందుకే టిఆర్ఎస్… బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిందని, పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గ జాతీయ రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలని ఆకాంక్షించారు, రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అన్ని సాధించి సీఎం కేసీఆర్ గడిచిన 8 ఏళ్ల కాలంలో ప్రజలకు కావలసిన సదుపాయాలు అందించారని పేర్కొన్నారు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, అంతర్గత రోడ్డు లు, ఉచిత కరెంట్ తదితర అంశాలను అందిస్తుందని అన్నారు, రోడ్లు, బ్రిడ్జిలు, సమస్యలు తీరడంతో ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు, పేదల సంక్షేమమే పార్టీ ప్రధాన ధ్యేయమని అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సారాధ్యంలోని బి ఆర్ ఎస్ పార్టీకి ప్రతి కుటుంబం అండగా నిలవాలని కోరారు, పినపాక నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం, బ్రిడ్జిల నిర్మాణం, చెక్ డాంల నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నమన్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి అభివృద్ధి పథంలో తీసుకపోతున్నామన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అడిగిన వెంటనే కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, బిక్కశాని శ్రీనివాస్ రావు, జలగం జగదీష్, పొడియం ముత్యాలమ్మ ,వలద సారయ్య, పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు