మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి21: రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం అశ్వాపురం మండలంలో పర్యటించారు. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బొక్క సామ నర్సిరెడ్డి, మల్లెల మడుగు గ్రామానికి చెందిన సురకంటి శంకర్ రెడ్డి, వేముల కిరణ్ కుమార్ లు ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అమరేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.