- విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాల అధిరోహించాలి….
- -ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.
- -పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి21: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. శ్రద్ధతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.