UPDATES  

 పసిపాపను అత్యాచారం చేసిన నిందితుడికి ఫోక్సో కేసులో 25 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు.

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 22
మండల పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన అజ్మీర సాయికిరణ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన  పసిపాపపై అత్యాచారం జరిపాడని అభియోగంతో 2018 జూన్ నెలలో బాధితుల ఫిర్యాదు మేరకు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అప్పటి ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేయగా అప్పటి ఏ ఎస్ పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ కేసు దర్యాప్తు చేసి ముద్దాయి సాయికిరణ్ 16 నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపిస్తూ కోర్టులో చార్జ్ షీట్ వేశారు ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఈ కేసు మండలంలో సంచలనo రేపింది ఇట్టి  కేసు నాలుగు సంవత్సరాల విచారణ అనంతరం 12 మంది సాక్షులను విచారించిన కోర్టు వాదోపవాదాలు విన్న అనంతరం కోర్టులో సాక్షాధారాలు రుజువు కావడంతో ముద్దాయి సాయి కిరణ్ కు కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పోక్సో స్పెషల్ జడ్జి ఎం శ్యాం శ్రీ  బుధవారం తీర్పు వెలువరించారు ముద్దాయికి  25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ,పది వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి బాధ్యతలు నిర్వహించగా దుమ్ముగూడెం కోర్టు పిసి సిహెచ్ హనుమంతరావులు సహకరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !