భూమి నైనా ఇవ్వండి.. మరణించేందు కైనా అనుమతి ఇవ్వండి… తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ నక్సలైట్ సమ్మయ్య ఆందోళన…. మన్యం న్యూస్ ఇల్లందు, ఫిబ్రవరి 22..
గత కొన్ని సంవత్సరాలుగా తన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలం చెందారని తనకు రావలసిన భూమి సమస్యను వెంటనే పరిష్కారించని పక్షంలో తాను మరణించేందుకు అనుమతి ఇవ్వాలంటూ మాజీ నక్సలైట్ కోడెం సమ్మయ్య అలియాస్ చంద్రన్న బుధవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం ప్రభుత్వం ఎకరంన్నర భూమిని తనకు ఇచ్చిందన్నారు.ఈ భూమిన ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా ఆక్రమించి ఆ స్థలంలో తోట,వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు.తన స్థలం ఇవ్వాలని అనేక విధాలుగా ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎదురుకుంటున్న సమస్యను అనేక పర్యాయాల అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యను పరిష్కరించడం లేదన్నారు.అధికార పార్టీకి చెందిన వైస్ చైర్మన్ అధికారులపై అనేక ఒత్తిడి తీసుకొస్తూ నా స్థలం నాకూ ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపించారు.అధికారుల తీరు చేస్తుంటే నాకు న్యాయం జరగదని తెలిసే మరణించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.తన మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావించి మరణించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నానని వాపోయారు