మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 22
మండలంలో పలు గ్రామపంచాయతీలలో సమస్యలపై స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.గ్రామపంచాయతీలలో ప్రధానంగా వేసవి కాలం లో ప్లాంటేషన్ లో మొక్కలను పెంచడం వంటి వంటి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.పొడి చెత్త తడి చెత్త, వేరు చేసే విధానాలను అమలు చేస్తూ తద్వారా రైతులకు కంపోస్ట్ ఎరువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.వాజేడు మండలంలో పలు గ్రామపంచాయతీలలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కార్యదర్శులు బాధ్యత వహించాలని అన్నారు.గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ క్రింద ప్రతి వ్యక్తికి వంద రోజులు పని కల్పించాలని, ప్రజలకు ఉపాధి కల్పించాలని ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎన్ఆర్ఈజీఎస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.