UPDATES  

 స్కౌట్స్ అండ్ గైడ్స్ సామాజిక సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం: ఎస్ ఓ టు జిఎం డి లలిత్ కుమార్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 22

మణుగూరు ఏరియా పీవి కాలనీ సింగరేణి పాఠశాల నందు బుధవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ” వరల్డ్ థింకింగ్ డే” కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎస్ ఓ టు జిఎం డి. లలిత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరల్డ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు బడేస్ పోవెల్ చిత్రపటానికి పూల మాలలు వేసిన అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పతకాన్ని ఆవిష్కరించారు.ఎస్ ఓ టూ జి ఎం డి లలిత్ కుమార్,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్, గుర్తింపు సంఘం నాయకులు వి ప్రభాకర్ రావు,పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యురాలు హసీనా,పాఠశాల ఉపాధ్యాయులు,స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధి విద్యార్ధిని విద్యార్ధులు కలిసి సంయుక్తంగా సర్వమత ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిధి లలిత్ కుమార్ మాట్లాడుతూ,తరతరాల యువత స్నేహ భావంతో,సేవ దృక్పదంతో జాతి సేవకు అంకితమయ్యేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని స్థాపించిన రాబర్ట్ బడేన్ పోవెల్, దూర దృష్టితో ప్రపంచ మానవ జాతికి చేసిన గొప్ప సేవకు గాను రాబర్ట్ బడేన్ పోవెల్ జన్మ దినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన వరల్డ్ థింకింగ్ డే నిర్వహించుకుంటున్నాము అని తెలిపారు.వారి గొప్ప సేవా దృక్పద స్పూర్తితో స్పౌర్ట్స్ అండ్ గైడ్స్ ఎంతో శిక్షణతో, క్రమ శిక్షణతో,చురుకుదనంతో, సేవా భావాన్ని అలవర్చుకోవడం సమాజానికి ఇతోధికంగా చేయుతను అందించడం,ఆపత్ సమయంలో ధైర్య సాహసాలు చూపడం వంటి గుణాలతో జాతి సేవలో నిమగ్నమయి, ప్రత్యక్షంగా సమాజానికి పరోక్షంగా దేశానికి అమూల్య సేవలు అందించాలి అని తెలిపారు.అలాగే 2023 ప్రపంచ ఆలోచన దినోత్సవం యొక్క నినాదమైన “మన గ్రహం,మన శాంతియుత భవిష్యత్తు” అంశాల సాధికారికతకు త్రికరణ శుద్ధిగా పాటుపడాలి అన్నారు. ఇందుకు గాను పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరేందుకు గాను తల్లిదండ్రులు కూడా తమవంతు ప్రోత్సాహం అందించాలి అన్నారు.ఈ
సింగరేణి పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో చివరి అంశమైన శాంతి యాత్ర ర్యాలీని ముఖ్య అతిధి డి లలిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించగా,ఈ ర్యాలీలో గౌరవ అతిధులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షకులు,పెద్ద సంఖ్యలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధి విద్యార్థునులు పాల్గొని సింగరేణి పాఠశాల నుండి కాలనీ వరకు శాంతి యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్,గుర్తింపు సంఘం నాయకులు వి ప్రభాకర్ రావు, పాఠశాల ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి హసీనా,పాఠశాల ఉపాధ్యాయులు,స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షకులు,స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !