UPDATES  

 హాస్టల్ వర్కర్ల సమస్యలు గిరిజన ఎమ్మెల్యేలకు పట్టవా…? – బకాయి వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుంది – సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు

మన్యం న్యూస్, భద్రాచలం , ఫిబ్రవరి 22
గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు గిరిజన ఎమ్మెల్యేలకు పట్టవా అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు ప్రశ్నించారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ఎదుట హాస్టల్ వర్కర్స్ నిర్వహించిన ధర్నా లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు పాల్గొని మాట్లాడుతూ… గిరిజన కార్మికులు 39 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వేతనాలు లేకుండా కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా దున్నపోతు మీద వాన పడిన చందంగానే వ్యవహరిస్తుందని విమర్శించారు. డైలీ వైస్ వర్కర్లకు 10 నెలలు వేతనాలు రావాలని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపు పై ఈ కుబేర్ లో పెట్టిన ఫ్రీజింగ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన వేతనాలకు సంబంధించిన చెక్కును ఆర్థిక శాఖ వెంటనే పాస్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని, ఐదు సంవత్సరాల సర్వీస్ గలిగిన కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు చెల్లించే వరకు ఔట్సోర్సింగ్ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. పాల్వంచ ఏటిడబ్ల్యూ పరిధిలోని కొందరు వార్డెన్లు సమ్మెను విచ్చిన్నం చేయటానికి కుట్రలు చేస్తున్నారని వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. వేతనాలు లేకుండా కార్మికులతో వార్డెన్లు వెట్టిచాకిరి చేయించుకుంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఆర్థిక మంత్రి మీద ఒత్తిడి తెచ్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ముందు సిఐటియు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ జిల్లా నాయకులు జలంధర్, ముత్తయ్య, లక్ష్మణ్, నాయక్, రామ, జయమ్మ, మంగమ్మ, యశోద, బాలరాజు, జోడి లక్ష్మి, నాగమణి, రాములు, స్వరూప, భద్రమ్మ, అజిత, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !