UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 రేగన్న అభయం.పినపాక మండలంలో ఎమ్మెల్యే రేగా విస్తృత పర్యటన.

  • రేగన్న అభయ
  • పినపాక మండలంలో ఎమ్మెల్యే రేగా విస్తృత పర్యట
  • పలువురిని పరామర్శించిన రేగా
  • బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన వారికి పార్టీ అండగా నిలుస్తుంది.

 

మన్యం న్యూస్, పినపాక, మార్చి 05

మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం పర్యటించారు . పలువురిని పరామర్శించడం జరిగింది. జానంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గైకోటి వెంకన్న  అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేపించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి యోగి క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాండురంగాపురం గ్రామానికి చెందిన యాలం సుశీల ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జానంపేట గ్రామానికి చెందిన గాండ్ల పవన్ ఇటీవల  మరణించడంతో వారి నివాసానికి మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దుగినేపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త భానోత్ వెంకన్న కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందడంతో పార్టీ తరపున మంజూరైన రెండు లక్షల రూపాయల విలువగల చెక్కును వారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ ఇన్సూరెన్స్ చేసి రెండు లక్షల ప్రమాద బీమా అందజేస్తుందని, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ను పార్టీ అధిష్టానం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలియజేశారు.  మల్లారం గ్రామంలో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య  మనవడు శాఖమూడి అఖిల్ సాయి  వివాహ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !