UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 పోయిరా తల్లి, పోయి మళ్ళీ రా జనం నుంచి వనం లోకి ప్రవేశం చేసిన వన దేవతలు..

మన్యం న్యూస్, మంగపేట, మార్చి 11

మంగపేట మండలం వాగ్గొడుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోగల లక్ష్మీ నర్సాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా జరిగిన శ్రీనాగులమ్మ మహా జాతర శ్రీ నాగులమ్మ , సడాలమ్మ అమ్మవార్ల వనప్రవేశంతో శనివారం జాతర ముగిసింది. పూజారులు వడ్డెలు ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు శ్రీ నాగులమ్మ అమ్మవారికి, సడాలమ్మ అమ్మవారికి రహస్య పూజలు జరిపి, శ్రీ నాగులమ్మ అమ్మవారిని గండొర్రె గుట్ట కు ప్రధాన పూజారులు బాడిశ రామకృష్ణ స్వామి,నాగ రమేష్ డోలు వాయిద్యాల నడుమ సాగనంపగా, సడాలమ్మ అమ్మవారిని సడాలమ్మ పూజారులు, వడ్డెలు పూజలు జరిపి యెర్రట్టల గుట్ట కు సాగనంపారు. వడ్డెలు, పూజారులు పంటలు బాగా పండాలని ,ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, ప్రజలు ఎలాంటి మహమ్మారి వ్యాధుల భారిన పడకుండా, అందరికీ మంచి జరగాలని వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు చేసి సాగానంపారు.శ్రీ నాగులమ్మ జాతర ఆద్యంతం భక్తులు భక్తి పార వశ్యంలో మునిగి తేలారు. భక్తులు ఆధ్యాత్మిక చింతన తో పాటు వినోద కార్యక్రమాలు ఇసుక వేస్తే రాలని జనం హాజరయ్యారు. ఈ సారి ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర విప్ రేగా కాంతారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద, బీజేపీ రాష్ట్ర నాయకులు తాటి కృష్ణ, బీఎస్పీ నాయకులు, పలు సంఘాల నాయకులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఎటువంటి ఆపశ్రుతి లేకుండ జరగటానికి సహకరించిన ప్రభుత్వ అధికారులు, పోలీస్ వారు, వైద్య సిబ్బంది, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, గ్రామ యువత, పెద్దలు ప్రతి ఒక్కరికి ఆ మహా తల్లి కృప, కటాక్షం లభించాలని శ్రీ నాగులమ్మ ఆలయ ఉపాసకులు బాడిశా రామకృష్ణ స్వామీజీ కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !