UPDATES  

NEWS

 కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి పువ్వాడ.జమ్మిగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 14.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. మంగళవారం అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చాతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, కంటి చూపు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుందని, అంధత్వంలేని తెలంగాణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, అన్నారు. కేంద్రాల్లో కంటి వెలుగు స్క్రీనింగ్ పరిక్షల నిర్వహణ అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన చేసుకోగలుగుతామని, గ్రామీణ ప్రాంతాల్లో కంటి పరీక్షలు చేసుకోవాలంటే పట్టణాలకు వెళ్ళాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కంటి వెలుగు ఒక మంచి ప్రజా ప్రయోజిత కార్యక్రమమని ప్రజలు మరింతగా సద్వినియోగించుకోవలని కోరారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, ఏ ఇతర పథకాలు చేపట్టినా వంద శాతం అమలు చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇంత గొప్ప పథకాలని అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యాంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలని మీ అందరిని కోరుతున్నానన్నారు. ప్రజా ప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకి అవగాహన కల్పించి అధికారులని సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, జడ్పీటీసీలు పైడి, చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి, ఎంపీటీసీ దుర్గ, సర్పంచ్ సూర్యకల, జమ్మిగూడెం గ్రామస్థులు, అభిమానాలు, పార్టీ కార్యకర్తలు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !