మన్యం న్యూస్, మణుగూరు, మార్చి18: తెలంగాణ పోరుగడ్డపై బిజెపి ఆటలు సాగనివ్వమని, జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరీ నాగేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జన చైతన్య యాత్ర గోడప్రతిని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించాలన్నారు. సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్త ఉద్యమం కొనసాగుతుందన్నారు. సిపిఎం అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జన చైతన్య యాత్ర కొనసాగుతుందన్నారు. యాత్రలో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. యాత్రలో మణుగూరు నుండి అధిక సంఖ్యలో మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా సిపిఎం పార్టీ శ్రేణులు పాల్గొంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు లెనిన్ బాబు, టీవీ ఎం.వి ప్రసాద్, ఉప్పతల నరసింహారావు, బొల్లం రాజు, మాచవరం లక్ష్మణరావు, గుర్రం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
