మన్యం న్యూస్ గుండాల, మార్చి 18 గుండాల నుంచి సాయనపల్లి వెళ్లే మార్గ మధ్యలో గల మల్లన్న వాగు సమీపంలో అదుపుతప్పి కారు పల్టీ కొట్టింది. గత రాత్రి సాయనపల్లి గ్రామంలో జరుగుతున్న వివాహానికి వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్టు స్థానికులు పేర్కొన్నారు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు .
