మన్యం న్యూస్ అశ్వాపురం, మార్చి 20
అశ్వాపురం మండలంలోనీ అమెర్ద గ్రామంలో గత కొన్ని రోజులుగా విషజ్వరాలు ప్రభలుతుండడంతో మండల కేంద్రం లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ జి.అరుణ ఆధ్వర్యంలో సోమవారం ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఆయుష్ 64 మాత్రలు పంపిణీ చేశారు.ఈ మాత్రల వలన జ్వరం వచ్చిన వారికి తగ్గుముఖం పడుతుంది అన్నారు.అలాగే జ్వరం వచ్చి తగ్గిన తరువాత కలిగే శారిరక ఇబ్బందుల నుంచి కోలుకునేల చేసి,వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేలా చేస్తుంది అని తెలిపారు.అలాగే జ్వరం రాని వారు కూడా ఉపయోగించుట వలన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిచుకొనవచ్చని వివరించారు.అలాగే విషజ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు,గృహ వైద్య చిట్కాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ స్టాఫ్ జీ.రాధిక, ఏఎన్ఎం శైలజ,ఆశ కార్యకర్త కిరణ్ కుమారీ,సెక్రటరీ అనూష,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.