UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం..

మన్యం న్యూస్, మంగపేట, మార్చి 20

సోమవారం మంగపేట మండల కేంద్రం అంబేద్కర్ భవనంలో మంగపేట మండలంలోని,వివిధ గ్రామాల గిరిజనేతరులు,మంగపేట మండలం వ్యాప్తంగా గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం ఏర్పాటుచేసుకోవడం జరిగింది.

సమావేశ అనంతరం పలు డిమాండ్లతో ఎంఆర్ఓ,ఎంపీడీఓ

లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

*గిరిజనేతరుల డిమాండ్స్*

1.ధరణి విషయంలో కోర్టు ఆర్డర్ ఇచ్చినందున మంగపేటలో ధరణి ఓపెన్ చేసి,గిరిజనేతరులకు,భూ మార్పిడి చేసుకునే అవకాశం కల్పించాలి.

2.సొంతపట్టా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం నాలా కన్వర్శన్ ఇవ్వాలి.

3.మంగపేట మండలం ఏజెన్సీ/నాన్ ఏజెన్సీ అనే విషయం కోర్టులో ఉన్నందున ఏజెన్సీ సర్టిఫికేట్ లు ఇవ్వకూడదు.

4.జి ఓ నం:3 పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినందున,గిరిజనేతరులు ఉద్యోగ అవకాశాల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలి.

5.గొప్ప వీరయ్య అనే ప్రభుత్వ గిరిజన ఉపాద్యాయుడు,విధులకు డుమ్మా కొడుతూ, మంగపేట మండలంలోని గిరిజనేతరుల భూ సమస్యలు,ఇంటి నిర్మాణాల విషయంలో తల దూర్చి,వివాదాలు సృష్టిస్తూ,అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.గిరిజనేతరులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.ఈయనపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి.

6.చెరువులలో చేపలు వేసుకోవడానికి గిరిజనేతరులకు కూడా అవకాశం ఇవ్వాలి.

ఈ కార్యక్రమంలో గిరిజనేతరులు అనేక సంఖ్యలో పాల్గొని గిరిజనేతర సమావేశం జయప్రదం చేశారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !