మన్యం న్యూస్ మణుగూరు టౌన్:2023 మార్చ్ 25
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియాలో,సింగరేణి కాలరీస్ ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి.వేంకటేశ్వర రెడ్డి శనివారం పర్యటించారు.ఈ సంధర్భంగా వారు మణుగూరు ఏరియా జిఎం దుర్గం రాంచందర్ తో కలసి పీకే ఓసి-2 వ్యూ పాయింట్ నుండి క్వారి లో జరిగే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడం జరిగింది. అనంతరం గనుల అధికారిలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో డైరెక్టర్ జి.వేంకటేశ్వర రెడ్డి మాట్లుడుతూ,బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో సింగరేణి మొత్తంలో మణుగూరు ఏరియా కు మంచి గుర్తింపు ఉందన్నారు.ఆ వరవడిని కొనసాగిస్తూనే,భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏరియాలో కొత్త గనులకు సంబందించిన నిర్దిష్టమైన ప్రణాళికలు వెంటనే రూపొందించుకోవాలి అని సూచించారు.ఈ సంవత్సరం వార్షిక లక్ష్యమైన 116 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించి ఉత్పత్తిలో,బొగ్గు రవాణాలో ఈ వార్షిక లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం అన్నారు.అలాగే రానున్న 2023-24 వార్షిక లక్ష్య సాధనకు,ఇప్పటి నుండే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని మ్యాన్ పవర్ ను,యాంత్రిక శక్తిని పూర్తి స్థాయిలో,వినియోగించుకోవాలని సూచించారు.పని గంటలను 13.5 గంటల నుండి 16.00 గంటలకు పెంచడం ద్వారా లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు అన్నారు. ముఖ్యంగా పికేఓసి-2 లో 42,000 టన్నుల నుండి 45,000 టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు.ప్రతి రోజు 3.20 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి ని,రక్షణ పద్ధతులు పాటిస్తూ వెలికితీసేలా, సంబందిత కంపెనీల పని తీరు పై ఆయా ఉపరితల గనుల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వేంకటేశ్వర రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిఓ పికెఓసి లక్ష్మీపతి గౌడ్,ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి,పికేఓసి-2 మేనేజర్ రాంబాబు,సర్వే అధికారి చిట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.