మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 2021-2022 వ సంవత్సరంకు గాను కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ గ్రామ పంచాయతీ అవార్డులలో భద్రాద్రి జిల్లాలో 17 పంచాయితీలు ఎంపిక కాగా, అందులో జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ స్థానం పొంది అవార్డును దక్కించుకుంది. ఆన్లైన్ మార్కుల ఆధారంగా, గ్రామ అభివృద్ధికి సంబంధించి తొమ్మిది రకాల థీమ్స్ విభాగాలలో విజేతగా నిలిచిన కాకర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ రమాదేవి, కార్యదర్శి నాని బాబులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నేషనల్ పంచాయితీ అవార్డును, కలెక్టర్ అనుదీప్ వారిని శాలువాతో సన్మానించి అవార్డు, పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా పురస్కారం పొందిన సర్పంచ్, కార్యదర్శులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. 9 విభాగాలలో నేషనల్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.
