UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే…

  • హ్యాట్రిక్ పక్కా
  • మళ్ళీ కేసీఆర్ సర్కారే
  • బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామ నాగేశ్వరరావు.
  • ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే రాములు నాయక్ పిలుపు

మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 25,

 

మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, బిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం జూలూరుపాడు మండలం వెంగన్న పాలెంలో ఆర్కె ఫంక్షన్ హాల్ లో జరిగిన

బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఎన్నికలకు కార్యకర్తలంతా సంసిద్ధులై ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తే పార్టీకి బలగం, బలం అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలే బీఆర్ఎస్ ను విజయపథంలో నడిపిస్తాయని ఉద్ఘాటించారు.

పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అభివృద్ధి గురించి మాట్లాడటం చాతకాని వాళ్ళు ఏదేదో పనికి మాలిన మాటలు చెప్తున్నారని, అటువంటి వారి పట్ల అప్ర మత్తంగా ఉండి, తరిమి కొట్టాలని అన్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైనికుల్లా పార్టీ విజయానికి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం పదిమంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా టెలికం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, ఉప్పునూతల నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నగంటి సతీష్ కుమార్, ఎంపీపీ సోనీ, జడ్పీటీసీ కళావతి, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, గిరిబాబు, వేల్పుల నరసింహారావు, చౌడం నరసింహారావు, పార్టీ మండల కార్యదర్శి నున్నా రంగారావు,

రైతుబంధు మండల కన్వీనర్ ఎదళ్ళపల్లి వీరభద్రం, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !