మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండలంలోని చిన్న బండి రేవు గ్రామంలో గిరిజన సహకార సంస్థ భద్రాచలం ఆధ్వర్యంలో గత రెండు నెలల కాలం నుండి పెట్రోల్ బంకు నిర్మాణం చేపడుతుండగా సంబంధిత బంకు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీ చట్టాలు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తికి జిసిసి ఉన్నతాధికారులు గుట్టు చప్పుడు కాకుండా అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భద్రాచలం ఐటీడీఏ దర్బారులో ఏపీవోకు ఫిర్యాదు చేశారు గత 20 సంవత్సరాలు నుంచి మండలంలోని ఏజెన్సీ గ్రామాల ఆదివాసి గిరిజన రైతులకు గిరిజన సహకార సంస్థ భద్రాచలం ద్వారా విత్తనాలు ఎరువులు పురుగుల మందులు వ్యవసాయ పరికరాలు పనిముట్లు అందించేందుకు వీలుగా చిన్న బండి రేవు గ్రామంలో జిసిసి నిర్మాణం చేశారని దాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు సేవలు అందించారని తదనంతరం నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ భవనాన్ని కూల్చి జిసిసి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్మాణం చేపట్టారని దాదాపు 90 శాతం నిర్మాణ పనులు పూర్తయివ్వగా ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తులకు బంకు బాధ్యతలు ఇచ్చారని ఈ నిర్మాణ పనులు బాధ్యతలు తనే చూసుకుంటున్నారని వారు చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయమై ఆరా తీయగా జిసిసి అధికారులు గుట్టు చప్పుడు కాకుండా భద్రాచలం కు చెందిన పెట్రోల్ బంకు యాజమాని అప్పజెప్పినట్లు తెలుస్తుంది ఏజెన్సీ చట్టాలకు లోబడి స్థానిక నిరుద్యోగ గిరిజన యువతకు అప్పగించాల్సిన ఈ బంకు బాధ్యతలు మైదాన ప్రాంత ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడం కావున దీన్ని పై సమగ్ర విచారణ జరిపి ప్రైవేటు వ్యక్తులకు బంకు బాధ్యతలను ఉపసంహరించుకోవాలని మండల నిరుద్యోగ యువతీ యువకులు బంకు బాధ్యతలు అప్పగించాలని అధికారులకు వినతి పత్రాలను అందించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో కూడా సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీవో మాట్లాడుతూ దీనిపై అధికారులతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని స్థానికంగా గిరిజనకు బంకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కలెక్టర్ ఐటిడిఏ ఏపీవో కలిసి దరఖాస్తులు అందించిన వారిలో సరియం వీర్రాజు వాగే రాజేశ్వరి వెంకటరమణ తెల్లం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.