మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 3 : పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనాయి. సోమవారం స్థానిక సెయింట్ జోసెఫ్, జిల్లా పరిషత్ఉన్నత పాఠశాలలో 267 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు చీప్ సూపర్డెంట్లు దుర్గాప్రసాద్, నారాయణ తెలిపారు. పరీక్షకు నూటికి నూరు శాతం మంది విద్యార్థులు హాజరైనారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యంతో పాటు వైద్య సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు.
