మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
దసరా సినిమాలో అంగన్ వాడి పాత్రలో నటుంచిన హీరోయిన్ పాత్ర ను కోడిగుడ్లు తొంగిలించినట్లు అవమాన పరిచే సన్నివేశాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ను, సెన్సార్ బోర్డును డిమాండ్ చేశారు. దసరా సినిమా ఆడుతున్న స్టానిక పూర్ణ థియేటర్ నందు అంగన్ వాడి టీచర్స్, హెల్పర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ మాట్లాడుతూ దసరా సినిమాలో అంగన్వాడీలను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు . నేటి రాజకీయ వ్యవస్థలో కుళ్లు, కుతంత్రాలు, అవినీతి, అక్రమాలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్న సమయంలో వాటిని ఎందుకు తెరకి ఎక్కించట్లేదో సమాధానం చెప్పాలన్నారు. అంగన్వాడి కార్యకర్తలు కరోనాకాలంలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతూ నిరంతరం కృషి చేసరని తెలిపారు. అట్టి కృషిను విస్మరించి గుడ్లను కోడిగుడ్లను దొంగతనం చేసే విధంగా అవమానపరిచి, కించపరిచేటట్లు ఉన్న సన్నివేశాలు ఎందుకు ఈ దసరా సినిమాలో పెట్టారని ఆయన ప్రశ్నించారు. అట్టి సన్నివేశాన్ని తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దసరా సినిమాను ఆడకుండా చేస్తామని హెచ్చరించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపట్ల సినిమా యంత్రాంగం దృష్టి పెట్టాలని హితవు పలికారు. అప్పుడే ప్రజలు హర్షిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి సీఐటీయూ నాయాకూరాళ్లు మాధవి, కళావతి, శైలజ రాజేశ్వరి, రత్నకుమారి, శారద తదితరులు పాల్గొన్నారు