UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 ముగిసిన కొర్రాజుల స్వామి జాతర వైభవంగా నిప్పుల గుండాలు కార్యక్రమం

 

మన్యం న్యూస్, దమ్మపేట, మే, 05: మండల పరిధిలోని లచ్చాపురం గ్రామంలో ఆదివాసి నాయక ఫోడ్ తెగవారు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర శుక్రవారంతో ముగిసింది. ఆదివారం ప్రారంభమైన జాతర ఐదు రోజులపాటు స్వామివారికి నిత్యం పూజలు సేవా కార్యక్రమాలు జరిగాయి. నిప్పుల గుండాల్లో నడిచే కార్యక్రమం శుక్రవారం రోజు జరిగింది. స్వామి వారు ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో ప్రతి గడపకు తిరిగి గుడి వద్దకు చేరుకున్నారు. గురువారం తెచ్చిన సండ్ర చెట్లను నరికి మంట పెట్టి రవ్వలుగా మార్చి ఆ నుప్పుల గుండంలో స్వామి వారితో పాటు భక్తులందరూ నడిచారు. అనంతరం సన్నాయి మంగళ వాయిద్యాలు డోలుచప్పులకు గణాచారులు, ఉత్సాహమైన యువకులు నృత్యాలు చేశారు. అనంతరం వరదాడు దెబ్బలు గణాచారుల ద్వారా కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల ఒంట్లో ఉన్న గాలి ధూళి పోతాయని నమ్ముతారు. అనంతరం గంధం పళ్ళు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. స్వామివారి గుడి వద్ద భోజనాలు ఏర్పాటు చేసుకొని సమూహంగా కూర్చుని భోజనాలు చేసారు. ఈ కార్యక్రమంలో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు పలువురు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !