UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 చంద్రబాబు కాన్వాయ్‌లోకి వైకాపా వాహనాలు..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో వైకాపా వాహనాలు దూసుకొచ్చాయి. ఈ ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి ఇలా వాహనాలు రావడం చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల 12న రైతు పోరుబాట నిర్వహించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు తణుకు వెళ్తుండగా.. ఉంగుటూరు వద్ద ప్రయాణిస్తుండగా వైఎస్సార్‌సీపీకి చెందిన రెండు వాహనాలు అనుసరించాయి.

ఈ వాహనాలు తాడేపల్లిగూడెం వరకు అనుసరించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. దాదాపు 15 కిలో మీటర్ల అనుసరించినట్లు తెలుస్తోంది. భద్రత నిబంధనల ప్రకారం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే దాకా సాధారణ వాహనాలను అనుమతించకూడదని టీడీపీ నేతలు అంటున్నారు.

ఒకవేళ ఆ వాహనాలు పొరపాటున వచ్చినా.. పోలీసుల ఎస్కార్ట్ వెంటనే తప్పించాల్సి ఉంటుంది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌ఎస్‌జీ సిబ్బంది.. ఆ వాహనాలను నియంత్రించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !