UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 అంతు చిక్కని వ్యాధి బాధిస్తుంది సుదీర్ఘకాలం పాటు వ్యాధి బారిన బాలుడు

  • అంతు చిక్కని వ్యాధి బాధిస్తుంది
  • సుదీర్ఘకాలం పాటు వ్యాధి బారిన బాలుడు
  • హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
  • తొమ్మిది సంవత్సరాలుగా ఆస్తులు అమ్మి వైద్యం చేయించిన తల్లిదండ్రులు
  • ప్రభుత్వం స్పందించి వైద్యం అందించాలని తల్లిదండ్రులు వేడుకలు
    మన్యం న్యూస్ వాజేడు

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని చంటపట్ల గ్రామం గజ్జల స్వర్ణలత సుధాకర్ దంపతులకు రెండవ సంతానంగా గజ్జల ఈశ్వర్ జన్మించాడు. బాబు జన్మించిన ఆరు నెలల వరకు ఆరోగ్యంగా ఉన్నారు. ఆరు నెలల తర్వాత బాబుకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి, బాబును చికిత్స నిమిత్తం హన్మకొండలో ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స చేయించారు.అనంతరం బాబుకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని డాక్టర్ తెలిపారు. వైద్యం కొరకు హైదరాబాద్ లో నీలోపర్ హాస్పటల్ కి రిఫర్ చేశారు.అప్పటినుండి 9 సంవత్సరాలుగా నెలకు రెండు లేదా మూడు సార్లు బ్లడ్ ఎక్కిస్తూ బాబును కాపాడుకుంటూ వస్తున్నారు. నిరంతరం 9 సంవత్సరాలుగా వైద్యం చేయిస్తూ భూములు, ఆస్తులు, అమ్మి ,తల్లిదండ్రులు సర్వం కోల్పోయి, కొడుకు ప్రాణాలు రక్షణ కోసం అప్పులు కుప్పలయ్యాయి, ఆస్తులు కరిగిపోయాయి, బాబుకు ట్రీట్మెంట్ చేయించే స్తోమత చేయి దాటిపోయిందని ఆ తల్లి తండ్రి బోరున విలపిస్తు మనోవేదనకు గురయ్యారు. ముక్కు పచ్చలారని బాలుడికి సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్, ప్రభుత్వం స్పందించి బాబు ఈశ్వరుని కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !