మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 17::
మండలంలోని కమలాపురం గ్రామంలో ఇటీవల ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాగరాజు వీరయ్య కుటుంబాలను భద్రాచలం రెడ్ క్రాస్ సంస్థ పరామర్శించి వారికి ఆర్థికంగా చేయూతని ఇచ్చారు తూరుబాక గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 12,000 రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులు అందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు పి దేశప్ప సుధాకర్ రెడ్డి సావ లక్ష్మీనారాయణ వెంకటరెడ్డి రాజారెడ్డి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు